కోర్టులో బియ్యం చల్లిన వ్యక్తి “చేతబడి”గా అనుమానం
ఇటీవల ఢిల్లీ కోర్టులో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి కోర్టు గదిలో న్యాయమూర్తి ఎదుటే బియ్యం గింజలు విసిరాడు. ఇది కోర్టు ధిక్కారమా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అన్న సందేహాలకు తావిస్తోంది. ఆగస్టు 11వ తేదీన అడిషనల్ సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాల ఎదుట ఒక కేసు విచారణ జరుగుతుండగా ఈ అసాధారణ ఘటన జరిగింది.
నిందితుడిని డాక్టర్ చందర్ విభస్‌గా గుర్తించారు. అతను వృత్తిరీత్యా ఒక సర్జన్. కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. డాక్టర్ చందర్ విభస్ ఒక్కసారిగా తన జేబులోంచి కొన్ని బియ్యం గింజలను తీసి న్యాయమూర్తి కూర్చునే వేదిక వైపు విసిరాడు. ఈ చర్యతో కోర్టు గదిలో ఉన్నవారందరూ షాక్‌కు గురయ్యారు. కోర్టు విచారణ 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. కోర్టులో బియ్యం చల్లడంపై న్యాయవాదులు, సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇది చేతబడి అయి ఉంటుందా అని అనుమానించారు. న్యాయవాదులు న్యాయమూర్తి వేదిక వైపు వెళ్లడానికి భయపడ్డారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు డాక్టర్ చందర్ విభస్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించారు. BNS సెక్షన్ 267 ప్రకారం.. కోర్టు విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడు కోర్టును క్షమించమని కోరాడు. తాను చేసిన పనికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ న్యాయమూర్తి అతని వాదనను అంగీకరించకుండా, ఈ చర్య కోర్టు పవిత్రతకు భంగం కలిగించేదిగా భావించి కఠినమైన శిక్ష విధించారు. తీర్పులో భాగంగా.. డాక్టర్ చందర్ విభస్‌కు 2,000 రూపాయల జరిమానాతో పాటు “జైలు శిక్ష”ను విధించారు. జైలు శిక్ష అనగానే ఎన్ని నెలలో, ఏళ్ల అనుకునేరు.. కోర్టు కార్యకలాపాలు ముగిసేంత వరకు మాత్రమే జైల్లో ఉంచాలని చెప్పారు. న్యాయస్థానంలో ప్రవర్తించే విధానం.. దాని గౌరవాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి గుర్తు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా ఈజీగా పట్టుకున్న యువకుడు
టీచర్ నో చెప్పిందని కక్ష పెంచుకున్న విద్యార్థి.. ఏం చేశాడంటే..
పార్లర్‌కు వెళ్తున్నారా? ఈ ప్రమాదంతో జాగ్రత్త