AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??

ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??

Phani CH
|

Updated on: Apr 17, 2023 | 8:33 PM

Share

ఆస్తికోసం బంధువులే రాబందులుగా మారతారు అని పెద్దలు చెబుతారు. అది అక్షరాలా నిజమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఓమహిళ అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను బంధువులు అంత్యక్రియలకు తరలిస్తూ నిజంగానే రాబందుల్లా ప్రవర్థించారు.

ఆస్తికోసం బంధువులే రాబందులుగా మారతారు అని పెద్దలు చెబుతారు. అది అక్షరాలా నిజమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఓమహిళ అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను బంధువులు అంత్యక్రియలకు తరలిస్తూ నిజంగానే రాబందుల్లా ప్రవర్థించారు. ఆమె మృతదేహంనుంచి వేలుముద్రలు తీసుకున్నారు. అది కూడా ఓ న్యాయవాది సమక్షంలో. ఈ ఘటన 2021లో జరగ్గా తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కమలా దేవి.. మే 8, 2021లో చనిపోయారు. గతంలోనే భర్త మరణించడంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఆ దంపతులకు పిల్లలు లేరు. అయితే, అంత్యక్రియల కోసం భర్త తరఫు బంధువులు ఆమె మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కారు కొద్ది దూరం వెళ్లగానే పక్కకు ఆపారు. ఓ న్యాయవాదిని పిలిపించి ఆమె నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత వాటితో తప్పుడు వీలునామా సృష్టించి ఆమె ఆస్తులు, ఆమెకు సంబంధించిన ఓ దుకాణాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలినుంచి వేలుముద్రలు సేకరిస్తున్న వీడియో దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ నిలువెత్తు రూపం

ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!

అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??

దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!

Published on: Apr 17, 2023 08:33 PM