Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ నిలువెత్తు రూపం
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో హీరో అని అందరికీ తెలుసు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసే వ్యక్తుల్లో సోనూసూద్ ముందుంటారు. కొవిడ్ సమయంలో దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో హీరో అని అందరికీ తెలుసు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసే వ్యక్తుల్లో సోనూసూద్ ముందుంటారు. కొవిడ్ సమయంలో దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో తనను ఆశ్రయించిన వారికి సోనూసూద్ అందించిన సాయం అంతా ఇంతా కాదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వలస కూలీలను వారివారి ప్రాంతాలకు తరలించారు. అంతేకాక కొందరి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించి మంచి మనసును చాటుకున్నారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు. ప్రస్తుతం ఒక స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నాడు. సోనూసూద్‌ని నటుడి కంటే గొప్ప మానవతావాదిగా అభిమానించేవాళ్లే ఎక్కువ. ప్రతి రాష్ట్రంలో సోనూసూద్ అభిమాన సంఘాలు ఉన్నాయి. తమ రియల్ హీరో మాదిరే వాళ్లు కూడా మంచి పనులు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా సోనూ సూద్ అభిమానులు 2500 కేజీల బియ్యంతో ఆయన చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూ సూద్ రూపాన్ని తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న తుకోజీరావు పవార్ స్టేడియంలో ఎకరం స్థలంలో సోనూ సూద్ చిత్రాన్ని బియ్యంతో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!
అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??
దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

