ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!

ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!

Phani CH

|

Updated on: Apr 17, 2023 | 8:29 PM

మాట ఆధారంగా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడా? లేదా? అని గుర్తించే ఏఐ (AI) ఆధారిత ప్రత్యేక టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. దీంతో గొంతు ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు.

మాట ఆధారంగా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడా? లేదా? అని గుర్తించే ఏఐ (AI) ఆధారిత ప్రత్యేక టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. దీంతో గొంతు ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు. జ్వరం, దగ్గు, జలుబు వంటి కారణాలతో చాలా మంది ఉద్యోగులు సెలవులు తీసుకుంటారు. సంస్థలు సైతం ఉద్యోగులు అనారోగ్యానికి గురైనప్పుడు వాడుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా సిక్‌ లీవ్‌లు ఇస్తుంది. కొంతమంది ఉద్యోగులు ఇతర అవసరాల కోసం ఒంట్లో బాలేదని చెప్పి.. సిక్‌ లీవ్‌ పెడుతుంటారు. ఇకపై ఆఫీస్‌కు ఫోన్‌ చేసి జలుబు చేసిందని అబద్ధం చెబితే మాత్రం ఇట్టే దొరికిపోతారు. సూరత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు ప్రచురించిన నివేదిక ప్రకారం.. గొంతు, మాట ఆధారంగా జలుబుతో బాధపడే వారిని కనిపెట్టవచ్చని తెలిపారు. ఈ పరిశోధనలో జలుబు చేసిన వ్యక్తుల గొంతును 70 శాతం కచ్చితత్వంతో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యోగి ఆఫీస్‌కు ఫోన్‌ చేసి.. జలుబుగా ఉందని చెబితే.. ఏఐ ఆధారిత సాంకేతికత ఆ ఉద్యోగి గొంతులోని మార్పు ద్వారా అతను నిజం చెబుతున్నాడా? లేదా? అని నిర్ధారిస్తుంది. ఇప్పటికే శ్వాస తీసుకునే పద్ధతుల ద్వారా పార్కిన్సన్స్‌ వ్యాధిని గుర్తించే ఏఐ సాంకేతికత అందుబాటులోకి రానుంది. అలానే, మాట ఆధారంగా ఏఐ ద్వారా కుంగుబాటు, కొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులను గుర్తించే సాంకేతికత కూడా అభివృద్ధి దశలో ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??

దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!

Published on: Apr 17, 2023 08:29 PM