కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. అలర్టయిన లేడీ కానిస్టేబుల్‌..

|

May 01, 2024 | 3:11 PM

కదులుతున్న రైలు ఎక్కవద్దని, పట్టాలు దాటవద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు పెడచెవిన పెడుతుంటారు. ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతుంటారు. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి జారి పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్‌ వెంటనే అలర్టయి అతణ్ణి కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

కదులుతున్న రైలు ఎక్కవద్దని, పట్టాలు దాటవద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు పెడచెవిన పెడుతుంటారు. ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతుంటారు. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి జారి పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్‌ వెంటనే అలర్టయి అతణ్ణి కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయిన ఆ వ్యక్తి పట్టు తప్పి పడిపోయాడు. ఓ వైపు రైలు కదులుతూ ఉండగానే.. పట్టాలకు, ప్లాట్ ఫామ్ కు మధ్య పడిపోయాడు. అతను ఏమాత్రం కదిలినా, కాస్త పైకి లేచేందుకు ప్రయత్నించినా.. అత్యంత దారుణంగా చనిపోయేవాడు. కానీ ఆ వ్యక్తిని గమనించిన ఉమ అనే మహిళా రైల్వే కానిస్టేబుల్ వేగంగా పరుగెత్తుకుని వచ్చింది. కదులుతున్న రైలు బోగీలు, రైలు మెట్లు తగలకుండా ఆ ప్రయాణికుడిని ప్లాట్ ఫామ్ కు అదిమి గట్టిగా పట్టుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రధాని మోదీని పోలిన పానీపూరీ వాలా.. ఆశ్చర్యపోతున్న జనం

చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్

Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్

Prabhas: ప్రభాస్ కోసం.. రెండేళ్ల వెయిటింగ్ పిరియడ్

Suriya: రూ.350 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న సూర్య