CPR: CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలి పోయారు. అటు వైపు వెళ్తున్న కొందరు సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పోలీసులు సీపీఆర్ చేసి అనేకమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా ఓ హెల్త్ అసిస్టెంట్ ఓ ప్రాణాన్ని నిలబెట్టాడు.
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలి పోయారు. అటు వైపు వెళ్తున్న కొందరు సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పోలీసులు సీపీఆర్ చేసి అనేకమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా ఓ హెల్త్ అసిస్టెంట్ ఓ ప్రాణాన్ని నిలబెట్టాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రధాన రహదారి లో బైకు మీద నడుపుతుండగా గుండె పోటు రావడంతో ప్రమాదానికి గురైన ఒక వ్యక్తిని అత్యవసర పరిస్థితుల్లో CPR చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. పెనుబల్లి కి చెందిన గాదం ఏసుబాబు బైకుపై ప్రయాణిస్తూ పట్టణంలోని దర్గా సమీపంలోకి రాగానే హఠాత్తుగా గుండె పోటు రావడంతో అస్వస్థతకు గురై అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న మహిళలను ఢీ కొని పడిపోయాడు. సరిగ్గా ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ గా పని చేసే రవి కుమార్ అనే ఉద్యోగి అపార్మక స్థితిలోకి వెళ్లిన గాదం ఏసుబాబుకు వెంటనే CPR చేసి ప్రాణాలు కాపాడినాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఏసుబాబు కు CPR చేసి ప్రాణాలు కాపాడిన సత్తెనపల్లి రవి కుమార్ ను స్థానికులు అభినందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.