కోట్లు లెక్క పెట్టే ఉద్యోగం వదిలేసి.. చెట్టెక్కి కూర్చున్నాడు
ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతకాలని అందరూ కోరుకున్నా జీవితంలో నెరవేర్చాల్సిన బాధ్యతల కోసం చాలా మంది తమ అభిరుచులతో రాజీ పడుతుంటారు. అయితే ఓ వ్యక్తి హవాయి అడవికి మారి ఒక్కడే తన కోసం ట్రీహౌస్ కట్టుకున్నాడు. అమెరికాకు చెందిన రాబర్ట్ బ్రెటన్ తనకు నచ్చిన దారిలో పయనించేందుకు
ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతకాలని అందరూ కోరుకున్నా జీవితంలో నెరవేర్చాల్సిన బాధ్యతల కోసం చాలా మంది తమ అభిరుచులతో రాజీ పడుతుంటారు. అయితే ఓ వ్యక్తి హవాయి అడవికి మారి ఒక్కడే తన కోసం ట్రీహౌస్ కట్టుకున్నాడు. అమెరికాకు చెందిన రాబర్ట్ బ్రెటన్ తనకు నచ్చిన దారిలో పయనించేందుకు సూపర్ మార్కెట్‌లో క్యాషియర్‌గా ఉద్యోగాన్ని వదులుకున్నాడు. టిక్‌టాక్ ద్వారా తాను ఆర్జించిన మొత్తంతో ఆ ప్రాంతంలో భూమి కొనుగోలు చేశాడు. భారత కరెన్సీలో రూ. 24.7 లక్షలు వెచ్చించి ఎకరం భూమి కొని ట్రీహౌస్ నిర్మించాడు. ప్రకృతి ఒడిలో నివసించాలని నిర్ణయించుకుని హవాయిలోని ట్రీ హౌస్‌కు మకాం మార్చాడు. అతడు కేవలం వర్షపు నీటిని సంరక్షిస్తూ అన్ని అవసరాలకు దాన్ని వినియోగిస్తాడు. తన పెరటిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో ఆహారం సమకూర్చుకుంటాడు. ప్రకృతికి దగ్గరగా ఉండే తన జీవన శైలిని ప్రతిబింబిస్తూ బ్రెటన్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌లు పెడుతుంటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిప్లొమా కంప్లీట్ చేసిన శునకం..ఎక్కడంటే ??
ఈ కోతి మహా చిలిపి.. ఏం చేసిందో చూస్తే నవ్వాగదు
బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..
ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!
విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??