చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్

|

Jan 31, 2024 | 8:01 PM

బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల మాటియస్ ఫాసియో అనే యువకుడికి వింత అనుభవం ఎదురైంది. స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న అతడికి.. ఒక్కసారిగా తలపై ఏదో పడినట్టు అనిపించింది. రక్తం వస్తుండటంతో.. స్నేహితులు ఆతడికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి.. కట్టు కట్టారు. అందరూ కూడా మాటియస్‌పైకి ఎవరో రాయి విసిరి ఉండొచ్చునని అనుకున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులు స్నేహితులంతా సరదాగా పార్టీ ఎంజాయ్ చేశారు.

బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల మాటియస్ ఫాసియో అనే యువకుడికి వింత అనుభవం ఎదురైంది. స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న అతడికి.. ఒక్కసారిగా తలపై ఏదో పడినట్టు అనిపించింది. రక్తం వస్తుండటంతో.. స్నేహితులు ఆతడికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి.. కట్టు కట్టారు. అందరూ కూడా మాటియస్‌పైకి ఎవరో రాయి విసిరి ఉండొచ్చునని అనుకున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులు స్నేహితులంతా సరదాగా పార్టీ ఎంజాయ్ చేశారు. అయితే నాలుగు రోజుల తర్వాత తలపై పడింది రాయి కాదు, బుల్లెట్‌ అని తెలిసి అంతా షాకయ్యారు. నాలుగు రోజుల పాటు బుల్లెట్ తలలోనే ఉంది. ఎలాంటి సమస్యా తలెత్తలేదు. ఆ తర్వాత ఓ రోజు కారులో వెళ్తుండగా.. అతడి చేతి స్పర్శ కోల్పోయినట్టు అనిపించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సదరు బాధితుడి తలను ఎక్స్‌రే తీసి చూడగా.. తలలో బుల్లెట్ కనిపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. అనంతరం రెండు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి.. బుల్లెట్‌ను బయటకు తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొదట రేసులో ఉన్న విగ్రహం ఇదే.. తెల్లని మక్రానా పాలరాయితో రామ్‌లల్లా

అయోధ్యకు వెళ్లే బస్సులు బంద్‌ !! ఎప్పటిదాకా అంటే ??

KGF: సూపర్ డూపర్ క్రేజీ న్యూస్.. మరో సారి కేజీఎఫ్

Mrunal Thakur: ‘ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు’ హీరోయిన్ ఎమోషనల్

పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్

 

Follow us on