చనిపోయిన భార్యకు నగలతో అలంకరించి నిత్య పూజలు !!

చనిపోయిన భార్యకు నగలతో అలంకరించి నిత్య పూజలు !!

Phani CH

|

Updated on: Jan 29, 2023 | 10:40 AM

సాధారణంగా తమకిష్టమైన వారు మరణిస్తే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు. సమాధులు నిర్మించి వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.. అందుకు భిన్నంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాట్యాతండాలో..

సాధారణంగా తమకిష్టమైన వారు మరణిస్తే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు. సమాధులు నిర్మించి వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.. అందుకు భిన్నంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాట్యాతండాలో జాటోతు వాల్యానాయక్ అనేవ్యక్తి తన భార్యపై ప్రేమను విభిన్నంగా చాటుతున్నారు.. ఏడాది క్రితం చనిపోయిన తన భార్య చిత్రాన్ని టేకు కలప పై చెక్కించి ఆరాదిస్తున్నారు. వాల్యానాయక్ భార్య పకీరాబాయి ఏడాది కిందట మృతిచెందింది.. తన భార్యను మరిచిపోలేకపోయిన ఈ గిరిజన రైతు తన జీవిత భాగస్వామిని వినూత్న రీతిలో ఆరాదిస్తున్నాడు. తనతో పాటుగా ఎడ్లబండిపై గడిపిన క్షణాన్ని మనసులో నెమరు వేసుకుంటూ.. టేకు కలపతో ఎడ్ల బండి బొమ్మను తయారు చేయించాడు. అందులో తన భార్య ఫకీరాబాయి ప్రతి రూపాన్ని చెక్కించారు. ఆ చిత్రాన్ని ఆభరణాలతో అలంకరించి రోజూ పూజ చేస్తున్నారు. తన భార్య ఏడబాటును మరిచి తమలో మమేకమై ఉన్నట్లుగా భావించి కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో పూజలు చేస్తున్నారు. టేకు కలపపై ఆమె ప్రతిరూపానికి నగలతో అలంకరించి మురిసిపోతున్నారు కుటుంబసభ్యులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్‌ కాకండి

కారుకి బ్రేక్‌ వెయ్యబోతే సీన్‌ రివర్స్‌.. ఏంజరిగిందో చూడండి !!

ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..

ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!

అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!