పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..

పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు.. అన్నాడో సినీ కవి. అది నిజమే అనిపిస్తుంది ఇక్కడి సీన్‌ చూస్తుంటే. ఓ పక్షి ప్రేమికుడు తన ఇంటి డాబాపైన పక్షుల కోసం ఆహారం ఏర్పాటు చేస్తుంటాడు. అందులో భాగంగా వరి కంకులను కుచ్చులుగా కట్టి డాబాపైన వేలాడదీస్తాడు. పక్షులు రోజూ అక్కడికి వచ్చి కడుపునిండా గింజలు తిని హాయిగా ఎగిరిపోతాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ అతని జీవితంలో భాగమైపోయింది.

పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..

|

Updated on: Aug 30, 2024 | 3:17 PM

పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు.. అన్నాడో సినీ కవి. అది నిజమే అనిపిస్తుంది ఇక్కడి సీన్‌ చూస్తుంటే. ఓ పక్షి ప్రేమికుడు తన ఇంటి డాబాపైన పక్షుల కోసం ఆహారం ఏర్పాటు చేస్తుంటాడు. అందులో భాగంగా వరి కంకులను కుచ్చులుగా కట్టి డాబాపైన వేలాడదీస్తాడు. పక్షులు రోజూ అక్కడికి వచ్చి కడుపునిండా గింజలు తిని హాయిగా ఎగిరిపోతాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ అతని జీవితంలో భాగమైపోయింది. అతని పుట్టిన రోజు సందర్భంగా పక్షులకు అతను స్పెషల్‌ విందు ఏర్పాటు చేశాడు. దాంతో గుంపులు గుంపులుగా చిలుకలు వచ్చి అతని ఇంటిపై సందడి చేశాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయిపేట గ్రామంలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలుకలు సందడి చేశాయి. పదేళ్లుగా వాటికి ఆహారం అందిస్తున్నాడు దొరబాబు. వరి కోతల సమయంలోనే ధాన్యపు కంకులు దొరుకుతాయి. మిగతా సమయంలో దొరకవు కనుక దొరబాబు బియ్యం గింజలను పక్షులకు ఆహారంగా అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దొరబాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా రామ చిలుకలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో బియ్యం, వేరుశనగ మొక్కజొన్న గింజలను జల్లి డాబా నుంచి కిందకు వెళ్ళగానే రామచిలకలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఆహారాన్ని తింటూ సందడి చేసాయి. పసందైన విందును ఆరగించే రామ చిలుకల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు పచ్చని చిలుకలు తోడుంటే.. అంటూ పాటందుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: ‘కల్కిగా నేచురల్ స్టార్’ ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని

Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్

సేమ్‌.. టు… సేమ్‌.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!

దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం

హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్

Follow us