Man-eater Cheetah: రక్తం రుచి మరిగిన చిరుత..చివరికి ఇలా అంతమైంది.! వీడియో..
మనిషి రక్తమాంసాల రుచి మరిగి.. ఉదయ్‌పూర్‌వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ని అధికారులు ఎట్టకేలకు మట్టుబెట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మదర్ గ్రామానికి సమీప ప్రాంతంలో చిరుతను గుర్తించి.. దానిని హతమార్చినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజయ్ చిత్తోరా పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా వరుసగా చిరుత దాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని.. ఒకవేళ బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిరుతపులుల భయానికి ఆ ప్రాంతంలో పాఠశాలలు కూడా మూతపడ్డాయి. సెప్టెంబరు 18 నుంచి ఇప్పటి వరకు చిరుత దాడుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విష్ణుగిరి అనే 65 ఏళ్ల పూజారి ఆలయ సమీపంలో నిద్రిస్తుండగా.. చిరుత దాడి చేసి హతమార్చింది. బుధవారం సైతం చిరుత ఇద్దరు మహిళలపై దాడి చేయడంతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. దీంతో చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు బోన్లు, కెమెరాలను అమర్చారు. ఊహించని విధంగా ఇప్పటివరకు మూడు చిరుతలు పట్టుబడినట్లు పేర్కొన్నారు. అయితే శుక్రవారం హతమార్చిన చిరుత మనుషుల రక్తం రుచి మరిగిందేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.