Diwali 2024: ధంతేరస్ రోజున బంగారమే కాదు.. వీటిని కొన్నా మీ ఇంట సిరుల పంటే.!
ధన్ తేరాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ ఈ పండుగ గురించి తెలుసు. ధంతేరాస్ రోజు ధన్వంతరీని పూజిస్తారు. ధన్వంతరీని పూజించడం వల్ల ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్న నమ్మకం. ఈ ధంతేరాస్ నుంచే దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 29న ధంతేరాస్ వస్తుంది. ఈ రోజున చాలా మంది బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలను కొనలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే వాటిని కొన్నా చాలా మంచిదని, ఆర్థికంగా బలపడతారని పండితులు చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను తలపెట్టినా తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటారు. తమల పాకులను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ధంతేరస్ రోజున తమల పాకులు కొని లక్ష్మీ దేవికి నైవేద్యంగా పెడితే.. ఆ జగన్మాత ఆశీస్సులు లభిస్తాయని అంటారు. ఆ తర్వాత రోజు వాటిని ఓ పవిత్ర నదిలో వదిలేయడం మంచిది. అలాగే కొత్తిమీర కొని ఇంటికి తీసుకొచ్చినా కూడా చాలా మంచిది. కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదు.
పసుపు – కుంకుమలు అమ్మవారికి ప్రీతికరంగా భావిస్తారు. కాబట్టి ధంతేరాస్ రోజున పసుపు, కుంకుమ కొని ఇంటికి తీసుకురావచ్చు. దీని వలన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ధంతేరస్ రోజున చీపుర్లు కొంటే చాలా మంచిది. ఎందుకంటే చీపురును లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారు. ఆ రోజున చీపురు కొని ఇంటికి తీసుకొస్తే.. ఐశ్శర్యం, అదృష్టం కలిసి వస్తుందట. ఇంట్లో గొడవలు కూడా తగ్గుతాయి. పేదవారికి చీపుర్లు, చెప్పులు, గొడుగులు కొని ఇచ్చినా మంచిదే. ధంతేరాస్ రోజు ఉప్పు కొన్నా చాలా మంచిది. ఉప్పును కూడా ఎంతో పవిత్రంగా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినా మంచిదే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

