Watch: ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్‌పై శునకం.. జనాలు షాక్.! వీడియో..
సాధారణంగా మనుషులు పర్వతారోహణం చేస్తుంటారు. ఎవరెస్ట్, కిలీమంజారా లాంటి ఎత్తయిన పర్వతాలు అధిరోహించి రికార్డులు సృష్టిస్తారు. తాజాగా ఓ శునకం ఎత్తయిన మిరమిడ్‌ను అధిరోహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈజిప్షియన్ పిరమిడ్లలో అత్యంత పెద్దదైన గిజా పిరమిడ్‌ను ఓ శునకం అధిరోహించింది. పిరమిడ్ మీదుగా ఎగురుతున్న పారా గ్లైడర్ మర్షల్ మోషర్ ఆ శునకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 448 అడుగుల ఎత్తుకు చేరుకున్న శునకం అక్కడ పక్షుల వేటలో మునిగిపోయింది. జంతు ప్రేమికులు సైతం పిరమిడ్ ఎక్కిన శునకాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అంతపైకి ఎక్కింది సరే.. మళ్లీ కిందికి ఎలా దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిరమిడ్‌కు సమీపంలోనే చాలా శునకాలు నివసిస్తున్నాయని, వాటిలో ఒకటి పక్షులను వేటాడుతూ అలా పైకి వెళ్లిపోయి ఉంటుందని చెబుతున్నారు. ఈ వీడియోను 25 మిలియన్లమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు. 25 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించి ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.