Family Bike: ఇది బైక్ కాదు.. ఫ్యామిలీ బస్.! ఒకే బైక్ పై దంపతులు, ఐదుగురు పిల్లలు వారి వెంట లగేజీ.. ఇంకా..
ఒక బైక్‌పైన సౌకర్యంగా ఇద్దరు .. కొంచెం సర్దుకుంటే ముగ్గురు ప్రయాణించొచ్చు. కానీ ఈ వీడియో చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ పైన ఏకంగా..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ వ్యక్తి తన బైక్‌పైన అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు రెండు పెంపుడు కుక్కలను కూడా ఎక్కించుకున్నాడు. ఎంతో చాకచక్యగా లగేజీని కూడా తగిలించుకుని ఏకంగా 40 కి.మీ వేగంతో దూసుకుపోతున్నాడు. అది చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వీరిలో ఒక్కరంటే ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పోలీసులకు పట్టుబడితే, చలాన్లు కట్టేందుకు ఈ వ్యక్తి లోన్ తీసుకోక తప్పదంటూ ఓ నెటిజన్ హాస్యంగా కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే.. ‘చలాన్లు ఏమీ ఉండవు. వీరిని ఆపిన వారు, అసలు ఇంత మంది ఎలా సర్దుకున్నారంటూ గమనించాల్సి వస్తుంది’ అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్ చేస్తున్నారు. తమదైనశైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

