Loading video

బౌలింగ్ చేస్తూ కుప్పకూలాడు.. ఏమైందో అర్థమయ్యేలోపే.. వీడియో

|

Jan 21, 2025 | 1:55 PM

రోజు రోజుకీ గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, వర్క్ లోడ్, ఆహారపు అలవాట్లు… ఇవ్వన్నీ గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అప్పటి వరకు హుషారుగా పని చేస్తూ..అందరితో కలివిడిగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది.

క్రికెట్ ఆడుతూ విజయ్ అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు.స్నేహితులతో సరదాగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు విజయ్. ఏమి జరిగిందో తెలియక ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. ఆస్పత్రికి తరలించేసరికే మృతిచెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూసుమంచిలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా విజయ్ కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అతన్ని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ కుటుంబం ఇరవై సంవత్సరాల క్రితం చెన్నై నుంచి వ్యాపార నిమిత్తం వచ్చి కూసుమంచిలో స్థిరపడ్డారు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన విజయ్ గుండెపోటుతో మృతి చెందడంతో తోటి మిత్రులు విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!

నుమాయిష్ ఎగ్జిబిషన్‌ రైడ్‌లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..

భారత్‌లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!

Published on: Jan 21, 2025 01:55 PM