Viral Video: ఓర్నీ ఏందిరా ఇదీ.. అంత బరువైన బాటిల్‌ని ఉఫ్‌ అని ఊదిపడేస్తున్నాడు..!

Viral Video: ఓర్నీ ఏందిరా ఇదీ.. అంత బరువైన బాటిల్‌ని ఉఫ్‌ అని ఊదిపడేస్తున్నాడు..!

Phani CH

|

Updated on: Mar 23, 2022 | 8:38 PM

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపపచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఎంతో టాలెంట్‌ ఉన్న ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు.

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపపచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఎంతో టాలెంట్‌ ఉన్న ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. వారిలోని ప్రతిభను సోషల్‌ మీడియా వేదికగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే. అద్భుతమైన టాలెంట్ ఉన్నఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను చేసిన ప్రదర్శన చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట వాటర్‌ నింపి ఉన్న బాటిల్స్‌ పదుల సంఖ్యలో వరుసగా నిలబెట్టి ఉన్నాయి. ఓ వ్యక్తి ఆ వాటర్‌ బాటిల్స్‌ని ఏదో దూదిని ఊది పాడేసినంత ఈజీగా నోటితో ఉఫ్‌.. అని ఊదుతూ కింద పడేస్తున్నాడు. ఆ వ్యక్తి టాలెంట్‌ను చూసి ప్రజలు షాకవుతున్నారు.. అతని అద్భుతమైన ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నీళ్లతో నిండిన బాటిల్‌ని అంత ఈజీగా ఎలా ఊదేస్తున్నారు… దీనికి చాలా అభ్యాసం కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Watch:

నాగచైతన్యను అన్‏ఫాలో చేసిన సమంత !! చైతూ మాత్రం ??

JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్