పెళ్లి కావడం లేదని.. అంత పని చేస్తావా బాసూ !!

|

Dec 15, 2024 | 12:00 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. ఓ వయస్సు వచ్చాక పెళ్లి గురించి చాలా మంది కలలు కంటుంటారు. తానకు కాబోయే భార్య ఇలా ఉండాలి.. కాబోయే భర్త అలా ఉండాలని యవతీ యవకులు ఊహల్లో తేలియాడుతుంటారు. అయితే ప్రస్తుత సమాజంలో రకరకాల కారణాల వల్ల పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోయారు. కొందరు యువకులకు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు కావటం లేదు.

వయస్సు పైబడుతోంది. కానీ పెళ్లి ఘడియలు మాత్రం ఇంకా రావటం లేదు. ఎక్కడా సంబంధాలు కుదరక అబ్బాయిలు విసిగిపోతున్నారు. కొందరు మ్యారేజ్ బ్యూరోల బాట పడుతున్నారు. అయినా సరే.. పెళ్లి సంబంధాలు రాకపోటవంతో మనో వేధనకు గరువుతున్నారు. ఈ వేదనతో కొందరు యువకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో విలువైన ప్రాణాలను క్షణికావేశంలో తీసేసుకుంటున్నారు. ఆత్మహ్యతలు చేసుకుంటూ కన్నవారికి, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావట్లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సంగు భాస్కర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తెలిసిన వారు, మ్యారేజ్ బ్యూరోల ద్వారా పెళ్లి సంబంధాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడా అమ్మాయి కుదరలేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్‌

మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..

ట్రంప్‌ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్‌ న్యూస్‌ అవుతుందా ??

అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!

అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!