టీచర్ నో చెప్పిందని కక్ష పెంచుకున్న విద్యార్థి.. ఏం చేశాడంటే..
భారతదేశంలో చదువు చెప్పే టీచర్‌ను గురువుగా పూజించడం సంప్రదాయం. కానీ ఓ విద్యార్ధి తనకు చదువు చెప్పే టీచర్‌పై ప్రేమ పెంచుకున్నాడు. టీచర్ కాదనేసరికి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. చివరికి టీచర్‌పై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన సంచలనం సృష్టించింది.
నర్సింగ్‌పూర్ జిల్లాలోని ఎక్సలెన్స్ స్కూల్‌లో చదువుకున్న 18 ఏళ్ల యువకుడు ఒక మహిళా గెస్ట్ టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో 26 ఏళ్ల టీచర్ తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..నిందితుడు సూర్యాంశ్ కొచ్చార్ తమ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివాడని ఎక్సలెన్స్ విద్యాలయ ప్రిన్సిపాల్ జిఎస్ పటేల్ తెలిపారు. నిందితుడు, సదరు మహిళతో గత రెండేళ్లుగా పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే సూర్యాంశ్ ఆమెపై వన్‌సైడెడ్ లవ్ పెంచుకున్నాడని చెప్పారు. ఈక్రమంలోనే కొన్ని నెలల క్రితం స్కూల్‌లో అతని ప్రవర్తనపై చర్యలు తీసుకుని, స్కూల్లోంచి తొలగించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అతను మరొక పాఠశాలలో చదువుతున్నాడు. ఆగస్టు 15 నాడు పాఠశాలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు చీర ధరించి వచ్చారు. దాంతో ఆమెపై నిందితుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ టీచర్ పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న సూర్యాంశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సూర్యాంశ్ బాటిల్‌లో పెట్రోల్‌తో టీచర్ ఇంటికి వెళ్లాడు. ఆమెను ఇంటిలో నుంచి బయటకు పిలిచి టీచర్‌పై పెట్రోల్ చల్లి నిప్పంటించి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్వాలి పోలీసులు నిందితుడిని డోంగర్‌గావ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అదుపులోనికి తీసుకున్నారు. గాయపడిన ఉపాధ్యాయురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సుమారు 15 శాతం వరకు కాలిన గాయాలు ఉన్నాయని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక చికిత్స అందుతున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పార్లర్‌కు వెళ్తున్నారా? ఈ ప్రమాదంతో జాగ్రత్త
Airtel: కస్ట్‌మర్లకు ఎయిర్‌టెల్ బిగ్ షాక్..
ఎంత పని చేసింది కాకి.. చివరికి ఏమైందంటే
40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు