Lychee Fruits: వారెవ్వా లిచీ..! విరగ్గాస్తున్న మధుర ఫలం.. ఎక్కడో తెలుసా.!

Lychee Fruits: వారెవ్వా లిచీ..! విరగ్గాస్తున్న మధుర ఫలం.. ఎక్కడో తెలుసా.!

Anil kumar poka

|

Updated on: Jun 11, 2024 | 10:39 AM

పోషకాల గని.. సర్వరోగ నివారిణి.. లిచీ ఫ్రూట్‌. ఇప్పుడు మన దగ్గర కూడా పండుతోంది. శీతల ప్రాంతాలకే పరిమితమైన ఈ లిచీ సాగు.. ఇప్పుడు ఏజెన్సీ లోనూ విరగ్గాస్తోంది. ఇన్నాళ్లు ఉత్తర భారతదేశానికే పరిమితమై.. నోరూరించే ఈ మధురఫలంఫై శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి. ఆపిల్, స్ట్రాబెరీ, ఆవకాడో డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం

పోషకాల గని.. సర్వరోగ నివారిణి.. లిచీ ఫ్రూట్‌. ఇప్పుడు మన దగ్గర కూడా పండుతోంది. శీతల ప్రాంతాలకే పరిమితమైన ఈ లిచీ సాగు.. ఇప్పుడు ఏజెన్సీ లోనూ విరగ్గాస్తోంది. ఇన్నాళ్లు ఉత్తర భారతదేశానికే పరిమితమై.. నోరూరించే ఈ మధురఫలంఫై శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి. ఆపిల్, స్ట్రాబెరీ, ఆవకాడో డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం కలిగిన అల్లూరి ఏజెన్సీ చింతపల్లిలో.. ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది. చైనా లో పుట్టి ఉత్తర భారతదేశంలో పండుతున్న.. లిచీ చింతపల్లిలో మంచి ఫలసాయమిస్తోంది.

అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనస్థానంలో ప్రయోగాత్మకంగా నాటిన లిచి చెట్లు కాపు కొచ్చాయి. వాతావరణం అనుకూలించడంతో ఏజెన్సీ రైతులు ఈపంటపై దృష్టి సారించారు. వాస్తవానికి లిచీ పళ్ళు.. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి అతిశీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అయితే.. అల్లూరి జిల్లాలో శీతల వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ప్రయోగాత్మకంగా ఈ పండ్ల మొక్కలను తీసుకొచ్చి పరిశోధనలు జరిపారు. బీహార్ నుంచి మూడు రకాల వంగడాలను తీసుకువచ్చి నాటారు. వీటిలో షాహిరకం లిచీ పళ్ళు సత్ఫలితాలనుస్తూ అధిక దిగుబడులు అందుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చింతపల్లిలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఈ సాగును ప్రోత్సహిస్తున్నట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు పేర్కొన్నారు.

పోషకాలు పుష్కలంగా ఉండే లిచీ.. కిలో 150వరకు పలుకుతోంది. లిచీ పండులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఈ పండు తినడం వలన గుండె, కాలేయం, మెదడు సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన పోషకాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం కేన్సర్, ఊబకాయం వంటి వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రైతులు వాణిజ్యపరంగా ఈ సాగు చేసుకునేందుకు అనేక అవకాశాలున్నాయని సూచిస్తున్నారు శాస్త్రవేత్త బిందు. వాణిజ్య పరంగా లిచీ ఉత్పత్తి లో చైనా మొదటి స్థానంలో ఉంది. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఇప్పటికే ఆపిల్, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో పంటలకు అనుకూలమైన చింతపల్లి ఏజెన్సీలో లిచీ పంటను విస్తరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.