Ancient Toilet‌: 2700 నాటి పురాతన టాయిలెట్‌.. అక్కడ అలా ఎలా ఉందంటే..? (వీడియో)

|

Oct 11, 2021 | 10:04 AM

జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను కనుగొన్నారు ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు . ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో జెరూసలేం ఒకటి. అయితే ఈ అతి పురాతనమైన టాయిలెట్‌ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేసింది.

జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను కనుగొన్నారు ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు . ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో జెరూసలేం ఒకటి. అయితే ఈ అతి పురాతనమైన టాయిలెట్‌ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేసింది. దీని ద్వారా పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్‌రూమ్‌లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్‌ కింద లోతైన సెప్టిక్‌ ట్యాంక్‌ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను వాడేవారని చెప్పారు. టాయిలెట్‌ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులో వారికి కొన్ని జంతువుల ఎముకలు, కొన్ని వస్తువులు లభించాయి. వాటి ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలి ఎలా ఉండేది, ఆ కాలంలో ఎలాంటి వ్యాధులు ఉండేవి లాంటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ఎస్టేట్లో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే సుమా!
మరిన్ని చదవండి ఇక్కడ : Drone Flower: మంత్రి మెడలో డ్రోన్‌ పూలదండ.. టెక్నాలజీ అంటే ఇదే మరి అంటూ కామెంట్స్..( వీడియో)

 War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు…ఎందుకంటే..?(వైరల్ వీడియో)

 News Watch: స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే.. ‘మా’రాజు విష్ణు… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 Visakhapatnam Airport: విమానాశ్రయంలో గందరగోళం.. మహిళ బ్యాగులో బుల్లెట్స్..ఎలా వచ్చాయంటే..!(వీడియో)