Ukrainian Couple: యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తులే పెళ్లి వస్త్రాలుగా..
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు మూడున్నర నెలల నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ..
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు మూడున్నర నెలల నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా జవాబిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లోనే ఓ ప్రేమ జంట సైనిక దుస్తుల్లోనే ఒక్కటైంది. యుద్ధం ఏమాత్రం తమ పెళ్లికి ఆటంకం కాదంటూ.. రణ క్షేత్రంలోనే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఎలాంటి ఆర్బాటాలు, ఆడంబరాలకు పోకుండా ఆర్మీ దుస్తుల్లోనే నవ దంపతులు ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. యుద్ధం ప్రేమికులను విడదీయలేదంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు.సైనిక దుస్తుల్లోనే ఒక్కటైన వధూవరులిద్దరూ చర్చి నుంచి బయటకు రాగా.. బంధువులు, స్నేహితులు కేరింతలు కొడుతూ వారికి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆంటోన్ గెరాశ్చన్కో (Anton Gerashchenko) ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈరోజుల్లో ఉక్రెయిన్‌లో వివాహాలు ఇలాగే జరుగుతున్నాయి.. తెల్లటి దుస్తులు లేవు. ఆర్బాటం అంతకంటే లేదు.. కానీ వారి మనసుల నిండా ప్రేమ ఉందంటూ మంత్రి అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

