Snakes Video: మట్టి కుండలో వింత శబ్ధాలు..  ఓపెన్‌ చేసి చూసిన యజమాని షాక్‌..!

Snakes Video: మట్టి కుండలో వింత శబ్ధాలు.. ఓపెన్‌ చేసి చూసిన యజమాని షాక్‌..!

Anil kumar poka

|

Updated on: May 19, 2022 | 8:29 AM

అంబేద్కర్ నగర్ జిల్లా మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాములు కలకలం రేపాయి. ఇంట్లో ఎప్పట్నుంచో ఉంచిన మట్టి కుండ పాములతో నిండిపోయింది. ఈ వార్త తెలియగానే చుట్టుపక్కల వారు పాములను చూసేందుకు


అంబేద్కర్ నగర్ జిల్లా మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాములు కలకలం రేపాయి. ఇంట్లో ఎప్పట్నుంచో ఉంచిన మట్టి కుండ పాములతో నిండిపోయింది. ఈ వార్త తెలియగానే చుట్టుపక్కల వారు పాములను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానికుల సమాచారంతో ఆ ఇంటికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ పాములను ఎంతో చాకచక్యంగా బంధించి తనతో పాటు తీసుకెళ్లాడు. ఇంత పెద్ద సంఖ్యలో పాములు కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.గ్రామానికి చెందిన రాజేంద్ర గౌర్ తన ఇంట్లో చాలా కాలంగా మట్టి కుండలు ఉంచినట్లు చెప్పారు. మంగళవారం అతని భార్య మట్టి కుండ దగ్గర ఉంచిన అన్నం తెచ్చేందుకు వెళ్లగా, పక్కనే ఉన్న మరో మట్టి కుండలో శబ్దం వచ్చిందని, దాన్ని తెరిచి చూడటంతో పామును చూసి భయపడిన ఆమె ఇంట్లోవారికి చెప్పినట్లు తెలిపారు. ఆ పాములన్నింటిని స్నేక్‌ క్యాచర్‌ సురక్షితమైన అడవిలో వదిలేశాడని, దొరికిన పాములు విషపూరితమైనవి కాదని అటవీ శాఖ బృందం పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 19, 2022 08:29 AM