కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??

|

May 24, 2024 | 9:25 PM

40 మందికి పైగా ప్రయాణిస్తున్న ఓ వాహనం ఛత్తీస్‌గఢ్‌ లోని ఓ లోయలో పడిన ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ బాధితుడు, తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలానని వాపోయాడు. ఆ భయానక ఘటన గురించి మాట్లాడాడు. కబీర్‌ధామ్‌ జిల్లా బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

40 మందికి పైగా ప్రయాణిస్తున్న ఓ వాహనం ఛత్తీస్‌గఢ్‌ లోని ఓ లోయలో పడిన ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ బాధితుడు, తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలానని వాపోయాడు. ఆ భయానక ఘటన గురించి మాట్లాడాడు. కబీర్‌ధామ్‌ జిల్లా బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అడవిలోకి వెళ్లి బీడీ ఆకులు సేకరించి మూటలతో వాహనంలో తిరిగి పయనమైనట్లు తెలిపాడు. కొందరు మహిళలు, పురుషులు, చిన్నారులు కూడా వ్యాన్‌లో ఉన్నారనీ తాను డ్రైవర్‌ పక్కన కూర్చున్నాననీ చెప్పాడు. ఆ సమయంలో బ్రేక్‌లు ఫెయిల్‌ అవడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడనీ అన్నాడు. దీంతో వెనక కూర్చున్నవారిని కిందికి దూకేయమని అప్రమత్తం చేసినట్లు చెప్పాడు. ఓ రాయి మీదకి ఎక్కించి వాహనాన్ని అదుపు చేయాలనుకున్నా కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని వాపోయాడు. తాను కూడా కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నట్లు చెప్పాడు. అందరూ వాహనం నుంచి దూకే లోపే జరగాల్సిన నష్టం జరిగిందని వాపోయాడు. తన భార్య సహా తన కుటుంబంలో 10 మందిని ఈ ప్రమాదంలో పోగొట్టుకున్నానని పరిస్థితిని వివరించాడు. మరో వైపు మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌సాయి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో రిటైర్డ్ సైనిక శునకం ప్రయాణం

కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌ !! బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాకు చిన్నారి బలి

చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. అది తప్పనిసరి

చాయ్ వాలాకు కోట్లలో ఆదాయ పన్ను.. అస్సలు రహస్యం తెలిసి కళ్ళు తేలేసారు