Petrol Bunks: సడన్‌గా పెట్రోల్ బంకుల్లో క్యూలెందుకు పెరిగాయ్.? అసలు మ్యాటరేంటి.?

|

Jan 03, 2024 | 2:34 PM

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌ ’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే, డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తారు.

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌ ’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే, డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్‌ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లోనూ ఇదే పరిస్థితి కన్పించింది. కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

అయితే, నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత న్యాయ చట్టంలోని నిబంధన ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు అంటున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on