జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో

Updated on: Mar 07, 2025 | 8:27 PM

ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకొ చొరబడటం పరిపాటిగా మారింది. ఆహారం, నీటికోసం పులులు, పాములు, ఎలుగుబంట్లు, ఏనుగులు పొలాల్లోనే కాకుండా గ్రామాల్లోకి కూడా చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఎంతో అరుదుగా కనిపించే పునుగు పిల్లులు సైతం జనావాసాల్లోకి వస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆదివారం గుంటూరు జిల్లాలో ఓ ఇంట్లోకి చొరబడి సందడి చేసింది పునుగు పిల్లి. తాజాగా కృష్ణాజిల్లాలో మరో పునుగు పిల్లి సంచారం స్థానికంగా కలకలకం రేపింది.

కృష్ణాజిల్లాల బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగుపిల్లిని స్థానికులు గుర్తించారు. రాత్రి సమయంలో సంచరిస్తున్న ఆ జంతువును చూసి మొదట ఏదో వింత జంతువుగా భావించిన స్థానికులు ఒకింత ఆందోళన చెందారు. ఆ జంతువు గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది పునుగుపిల్లిని పట్టుకుని బంధించారు. తరచూ జనావాసాల్లోని పునుగుపిల్లులు రావడంపై అవీశాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే పునుగుపిల్లి ఒక్కటే ఉండదని మరికొన్ని ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మిగితా వాటి కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు. ఎంతో అరుదుగా కనిపించే ఈ పునుగుపిల్లులు ఎక్కువగా శేషాచలం అడవుల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వీటి నుంచి వచ్చే తైలంతో సాక్షాత్తు ఆ తిరుమలేశుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు అర్చకులు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని ప్రత్యేకంగా పెంచుతారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత పునుగు తైలాన్ని పులుముతారు. ఈ క్రమంలో పునుగుపిల్లుల సంఖ్యను పెంచేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మరిన్ని వీడియోల కోసం :

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…

తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో