Lightning Video: భారీ పిడుగు నేలను తాకితే ఏమి జరుగుతుందో తెలుసా? ఆ భయానక సంఘటన చూస్తే షాక్ అవుతారంతే!

ఎప్పుడన్నా పిడుగులు పడటం మీరు చూశారా? మనలో చాలా మంది దూరంగా పిడుగులు పడుతున్న దృశ్యాన్ని ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు.

Lightning Video: భారీ పిడుగు నేలను తాకితే ఏమి జరుగుతుందో తెలుసా? ఆ భయానక సంఘటన చూస్తే షాక్ అవుతారంతే!
Lightning Video
Follow us
KVD Varma

|

Updated on: Sep 23, 2021 | 3:46 PM

Lightning Video: ఎప్పుడన్నా పిడుగులు పడటం మీరు చూశారా? మనలో చాలా మంది దూరంగా పిడుగులు పడుతున్న దృశ్యాన్ని ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. పిడుగు ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు తీగలా.. పెద్ద శబ్దంతో నేలను తాకడం సహజంగా మనం చూస్తుంటే కనిపిస్తుంది. అది కూడా చాలా దూరం నుంచి. కానీ, పిడుగు పడిన తరువాత అక్కడ బీభత్సమైన మంటలు చెలరేగడం దాదాపుగా ఎవరూ చూసి ఉండరు. చాలా తక్కువ మందికి ఈ అనుభవం ఎదురవుతుంది. అటువంటి సంఘటన ఒకటి ఒకరి కెమేరాకు చిక్కింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఒక షాకింగ్ సంఘటన కెమెరాకు చిక్కింది. ఇక్కడ ఆకాశం నుండి పడుతున్న మెరుపులు ఒక పెద్ద ప్రాంతాన్ని బలంగా తాకాయి. తరువాత ఒక బలమైన కాంతి తరువాత పెద్ద పేలుడు లాంటి శబ్దం వచ్చింది. ఈ సంఘటనను రికార్డ్ చేసిన వ్యక్తి మెరుపు ఉపరితలంపై పడిన తర్వాత పొగ వచ్చిందని, ప్రజలు కేకలు వేయడం.. అలాగే అక్కడక్కడ పరిగెత్తడం ప్రారంభించారని పేర్కొన్నారు.

నిజానికి ఈ సంఘటన 4 మే 2021 నాడు చోటుచేసుకుంది. సెప్టెంబర్ 21 న, ఇది యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ అయింది. తన ఇంటి కిటికీ నుండి వీడియో చేస్తున్న రాకేశ్ రౌత్, పేలుడు సంభవించినట్లు ఒక క్షణం భావించానని చెప్పాడు. దీని తరువాత, ఆ దృశ్యానికి భయపడిన రాకేష్ తన కిటికీని మూసివేసాడు.

200 మీటర్ల దూరం నుండి వీడియో..

ఈ వీడియోను షేర్ చేసుకుంటూ రాకేష్ ఇలా తన కేప్షన్ రాశారు. ”నేను భోజనం తర్వాత నిద్రపోతున్నాను. బయట తుపాను వాతావరణం నెలకొని ఉంది. నా అపార్ట్‌మెంట్‌కు చాలా దగ్గరగా మేఘాల ఉరుము విని, నేను లేచి కిటికీలోంచి చూశాను. దీని తర్వాత నేను నా మొబైల్ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. ఈ సమయంలో సుమారు 200 మీటర్ల దూరంలో ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి పడిపోయి అక్కడ భూ ఉపరితలాన్ని తాకింది. పేలుడు చాలా బలంగా ఉంది, అది నన్ను కూడా కదిలించింది. ఆ తర్వాత కొంత మంది అక్కడ నుండి పరిగెత్తడం నేను చూశాను. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసింది.”

వీడియోలో ఏముంది?

ఈ 49 సెకన్ల వీడియోలో 18 వ సెకనులో మెరుపు సంఘటన చూడవచ్చు. ఆకాశం నుండి మెరుపులు పడిన కొన్ని సెకన్ల తర్వాత, పక్షుల గుంపు అక్కడ నుండి ఎగురుతూ కనిపించింది.

ఆ వీడియో మీరూ ఇక్కడ చూసేయండి:

ఇవి కూడా చదవండి:

Viral Video: పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులు పాటు తన చెరలో ఉంచుకుని ఆ తరువాత..

Viral Video: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!