ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..

|

Dec 16, 2024 | 9:03 PM

చాలామంది ఇంటినుంచి బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేసి చెప్పుల స్టాండ్‌లో పెట్టి వెళ్తుంటారు. సాధారణంగా ఇంట్లో నలుగురు సభ్యులున్నప్పుడు ఒకే తాళం చెవి ఉన్నప్పుడు మిగతావారి కోసం ఇలా చేస్తుంటారు. చెప్పుల స్టాండ్‌లో తాళం ఉంటుందని ఎవరూ ఊహించరని చాలామంది భావిస్తారు. అదే ఒక్కోసారి వారి కొంప ముంచుతుంది.

అందుకు ఉదాహరణే ఈ ఘటన. విజయనగరం జిల్లాలోని రాజాం మండలం ఈశ్వర్ నగర్ కాలనీలో సత్యనారాయణ అనే ఒక జనరల్ స్టోర్ వ్యాపారి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజు ఉదయాన్నే సత్యనారాయణ తన భార్యతో కలిసి ఇంటి నుండి షాప్ కి వెళ్తాడు. మళ్లీ షాప్ క్లోజ్ చేసి రాత్రికి ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఉదయం షాప్ కి వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి బయట ఉన్న షూ స్టాండ్ లో పెట్టి వెళ్లడం వీరికి అలవాటు. అంతే కాకుండా ఇంట్లో ఉన్న బీరువా తాళాలు సైతం తాళం వేసి బీరువా మీదే పెడుతుంటారు. అయితే ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి ఆ తాళం షూస్టాండ్ లో పెట్టి షాప్ కివెళ్ళిపోయారు సత్యనారాయణ దంపతులు. రోజూలాగే తిరిగి సాయంత్రం షాపు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తలుపు తెరిచి ఉంది. హడావుడిగా లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా కూడా తెరిచి ఉంది. తెరిచి ఉన్న బీరువాను వెతికి చూడగా బీరువాలో దాచిన 15 తులాల బంగారం కనిపించలేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

33 గంటలు… నిర్విరామంగా హనుమాన్‌ చాలీసా పారాయణం

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం

ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు

వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??

భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక