తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే..
ఆమె కన్న తల్లి కాదు. కనీసం పరిచయస్తురాలైన పొరుగింటావిడ కూడా కాదు. పరీక్షా ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ. కానీ ఎవరో బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది.
ఆమె కన్న తల్లి కాదు. కనీసం పరిచయస్తురాలైన పొరుగింటావిడ కూడా కాదు. పరీక్షా ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ. కానీ ఎవరో బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది. తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి…తల్లడిల్లిపోయింది. తన బిడ్డకాని బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. లాలించింది. పసివాడిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుని…ఓదార్చింది. పాలుపట్టి తల్లి ప్రేమను పంచి.. ప్రపంచాన్ని మురిపించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓ తల్లి కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు తన కన్న బిడ్డను భర్త చేతికి అప్పగించి పరీక్షా కేంద్రానికి పరుగులు తీసింది. కానీ తల్లి అలా వెళ్లిందో లేదొ … ఆ బిడ్డ గుక్కపట్టి ఏడ్వటం మొదలుపెట్టాడు. ఆ పసిబిడ్డఏడుపును ఆపడం తండ్రి వల్లకాలేదు. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న బాబును తండ్రి సముదాయించలేక ఇబ్బంది పడుతుంటే .. అక్కడే విధులు నిర్వర్తిస్తోన్న మరో మహిళా పోలీసు అమరావతి చలించిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ.. ఓపెన్ అయిపోయిన అమ్మాయి.. ఏం చేసిందో చూడండి !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

