కంటతడి పెట్టిస్తున్న SI చివరి ఫోన్ కాల్.. సూసైడ్‌కు ముందు ఏం జరిగిందంటే? వీడియో
తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయం, తన భార్య, పిల్లలు ఏమైపోతారోనని ఆయన పడిన ఆవేదన అందరిని కలచివేస్తోంది. తనని అనవసరంగా కొన్ని విషయాల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందిన ఎస్ఐ మూర్తి.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నట్లు ఆ కాల్ లో మాట్లాడారు.
తనని రేంజ్‌కి రిపోర్టు చేయమన్నారని.. అందుకు బాధగా ఉందని.. ఇక తనకు బతకడం ఇష్టం లేదని తన స్నేహితుడికి ఫోన్ లో చెప్పాడు. సంబంధం లేని విషయంలో తనను కావాలనే ఇరికించి, ఆ ఇద్దరూ ఇబ్బందులు పెడుతున్నారని ఫ్రెండ్‌తో వాపోయాడు. తన భార్యాపిల్లల్ని తలచుకుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేంజికి రిపోర్టు చేస్తే కృష్ణా జిల్లాకు పంపిస్తారని, అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని బాధపడ్డాడు. నిన్ను నమ్ముకున్న వారి కోసం ఆలోచించు అని మూర్తికి తన స్నేహితుడు చెప్పారు. తాను వేరే చోటుకు వెళ్లలేనని, తన వల్ల కావడం లేదని మూర్తి కంటతడి పెట్టారు. భార్య బిడ్డలకు న్యాయం చేయాలన్న మూర్తి ఫోన్ కాల్ ఆడియో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి
