పిల్లల దాహార్తిని తీర్చడం కోసం ఓ మహిళ చేస్తున్న సాహసం

|

Feb 10, 2024 | 12:02 PM

ఉత్తర కన్నడ జిల్లా గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల ఓ మహిళ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుడి గురించి కొండను తవ్వి రోడ్డు వేసిన బీహారీ దర్శత్ మాఝీ గురించి మనం విన్నాం. అంతటి స్థాయిని దక్కించుకుంది ‘గౌరి. నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది గౌరి. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది.

ఉత్తర కన్నడ జిల్లా గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల ఓ మహిళ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుడి గురించి కొండను తవ్వి రోడ్డు వేసిన బీహారీ దర్శత్ మాఝీ గురించి మనం విన్నాం. అంతటి స్థాయిని దక్కించుకుంది ‘గౌరి. నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది గౌరి. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథి అని అభివర్ణిస్తున్నారు. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం క్రితం ప్రారంభించింది. రోజూ పలుగు, పార, బుట్ట, తాడు సాయంతో ఆమె ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ మట్టిని తవ్వి తీస్తోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని గౌరి లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చేసిన మాఘమాసం.. పెళ్లికాని ప్రసాదులకు పండగే

విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..

Guntur Kaaram: OTTలో గుంటూరోడికి దిమ్మతిరిగే రెస్పాన్స్.. ఇది మహేష్‌ క్రేజ్‌ అంటే !!

హనుమాన్‌ పై నెగెటివ్ ప్రచారం.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..

ఓటీటీలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే

Follow us on