విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..

విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..

Phani CH

|

Updated on: Feb 10, 2024 | 11:58 AM

విండోస్11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని వెల్లడించింది. యూజర్లు మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ యాప్‌‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, ఆఫీస్ 365 టూల్స్‌లో భాగంగా ఔట్ లుక్ యాప్‌ సర్వీసును అందించనున్నట్టు తెలిపింది.

విండోస్11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని వెల్లడించింది. యూజర్లు మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ యాప్‌‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, ఆఫీస్ 365 టూల్స్‌లో భాగంగా ఔట్ లుక్ యాప్‌ సర్వీసును అందించనున్నట్టు తెలిపింది. దీంతో రోజువారీ కార్యకలాపాల కోసం విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లపై ఆధారపడుతున్నవారు డిసెంబర్ 31, 2024లోపు ఔట్‌లుక్ లోకి మారాల్సి ఉంటుంది. పాప్-అప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు ప్రకటనలో కంపెనీ పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Guntur Kaaram: OTTలో గుంటూరోడికి దిమ్మతిరిగే రెస్పాన్స్.. ఇది మహేష్‌ క్రేజ్‌ అంటే !!

హనుమాన్‌ పై నెగెటివ్ ప్రచారం.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..

ఓటీటీలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ.. అయితే ఆమె రష్మికనా ?? కాదా ??