MIT on AI Toll: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. AI వచ్చినా మీ జాబ్ సేఫ్.. ఎలా అంటే..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ.. ఈ టెక్నాలజీ కారణంగా ఎందరో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికీ ఇంకెందరో తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టిన ఈ ఏఐ టెక్నాలజీతో మరిన్ని ఉద్యోగాలు గల్లంతు కావడం ఖాయమని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అధ్యయనం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ.. ఈ టెక్నాలజీ కారణంగా ఎందరో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికీ ఇంకెందరో తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టిన ఈ ఏఐ టెక్నాలజీతో మరిన్ని ఉద్యోగాలు గల్లంతు కావడం ఖాయమని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అధ్యయనం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాలను ఇప్పటికిప్పుడు కృత్రిమ మేధతో భర్తీ చేయడం దాదాపు అసాధ్యమని పేర్కొంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపింది. మానవశ్రమను ఏఐతో భర్తీ చేయడంలో ఉన్న అనుకూలతలపై MIT అధ్యయనం చేసింది. AI ని ఎక్కువ సమయం ఉపయోగించడం కంటే కొన్ని నిర్దిష్ట పనుల కోసం మనుషులను ఉపయోగించుకోవడమే మేలని, అంతేకాకుండా AI తో పోలిస్తే ఇది చాలా చవక అని కూడా అధ్యయనం తేల్చింది.
ఆటోమేషన్ ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉండదని MIT కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పరిశోధకుడు నీల్ థాంప్సన్ స్పష్టం చేశారు. కార్మికుల వేతనాల్లో 23 శాతం మాత్రమే AI ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని రంగాల్లో కార్మికులు తక్కువ వేతనాలకే లభిస్తున్నట్టు పేర్కొన్నారు. AI తో దృశ్య గుర్తింపు సాంకేతికతను వ్యవస్థాపించడం, ఆపరేట్ చేయడం చాలా ఖరీదైనదని వివరించారు. కంప్యూటర్ విజన్ టాస్కులు కంపెనీలకు ఆర్థికంగా అనుకూలంగా మారేందుకు దశాబ్దాలు పడుతుందని అధ్యయనం అంచనా వేసింది. కాబట్టి ఇప్పటికిప్పుడు కృత్రిమ మేధతో ఉద్యోగాలకు వచ్చే ముప్పేమీ లేనట్టేనని తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..