మగ-మగ కలిసినా సంతానం.. జపాన్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి
సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ప్రయత్నాలలో శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ప్రయత్నాలలో శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. భవిష్యత్తులో ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని పొందేందుకు ఈ విధానం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్పై లండన్‌లో జరిగిన మూడవ అంతర్జాతీయ సమ్మిట్‌లో ఈ కీలక పురోగతిని.. జపాన్ శాస్త్రవేత్తలు సమర్పించారు. తొలుత మగ ఎలుక చర్మ కణాలను తీసుకున్నారు. ఇండ్యూస్డ్ ప్లూరీపొటెంట్ స్టెమ్ కణాలను సృష్టించేందుకు ఆ చర్మకణాలను మూలకణాల స్థితికి చేర్చారు. తర్వాత- వాటి నుంచి ‘వై’ క్రోమోజోంను తొలగించారు. ఆ స్థానంలో మరో ‘ఎక్స్’ క్రోమోజోంను ప్రవేశపెట్టారు. ఆ కణాలు అండాలుగా తయారయ్యేలా చేశారు. అనంతరం ఈ అండాలను మరో ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత అలవాటు.. రైల్ టికెట్ కొంటారు.. కానీ ప్రయాణించరు !!
Vishwak Sen: NTR కోసం.. దమ్కీ దాస్ ఊర మాసు టైటిల్
ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేస్తావ్ ?? సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..
శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!
Kantara: వావ్ !! కాంతారకు ఆస్కార్ రేంజ్ గౌరవం..
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

