మగ పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్‌ ఐబ్రోస్‌, మాయిశ్చరైజింగ్ లో మెళకువలు

Updated on: Feb 28, 2025 | 11:58 AM

పోలీసు రంగంలో పని చేసే ప్రతీ ఒక్కరికి.. నిందితులను పట్టుకుని, వారికి శిక్ష పడేలా చేయడానికి కావాల్సిన శిక్షణను ఇస్తుంటారు. గన్ ఫైరింగ్ దగ్గర నుంచి జాగిలాల సేవలను ఉపయోగించుకోవడం, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో హాజరుపరచడం వరకు అన్నీ నేర్పుతుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే పోలీసులు మాత్రం మేకప్‌లో శిక్షణ పొందుతున్నారు.

అసలు పోలీసులకు ఇది ఏ రకంగా, ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. జపాన్‌లోని ఓ పోలీసు అకాడమీ.. తమ వద్ద శిక్షణ పొందుతున్న పురుష అధికారులకు.. ఎవరూ ఇవ్వని శిక్షణ ఇస్తోంది. ముఖ్యంగా బ్యూటీ కన్సల్టెంట్లను పిలిపించి మరీ మేకప్ కళలో శిక్షణ ఇప్పిస్తోంది. పుకుషిమాలోని పోలీసు అకాడమీలో 2025 జనవరి నెలలో మొత్తం 60 మంది పోలీసు అధికారులకు మేకప్ కోర్సు ప్రారంభించినట్లు.. అక్కడి స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ఐబ్రోస్ చేసుకోవడం, పెన్సిల్ వాడడం, మాయిశ్చరైజింగ్‌, ప్రైమర్లు పూసుకోవడం, అప్పుడప్పుడూ మాస్క్‌లు, ఫేస్ ప్యాకులు వేసుకోవడం, హెయిర్ స్టైలింగ్ నేర్పిస్తున్నారు. ఇందుకోసం మేకప్ కన్సల్టెంట్లను పోలీసు అకాడమీకి రప్పిస్తున్నారు. వారి చేత కూడా అప్పడప్పుడూ అనేక మెళుకవలు నేర్పిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. అసలు పోలీసు అధికారులకు అందులోనూ పురుష క్యాడెట్లకు మేకప్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??

నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్‌ !!

ప్రియుడి కోసం ప్రియురాళ్ల మధ్య పోటీ.. విషం తీసుకొని…

అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?

దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్‌’ గా ప్రభాస్ | తండేల్‌కు లీకర్స్ బిగ్ ఝలక్