నూడుల్స్ ఆర్డర్ చేస్తే బతికున్న కప్ప !! కస్టమర్‌కు షాక్
జపాన్ లోని ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి నూడుల్స్ ఆర్డర్ చేస్తే పాపం అతడికి నూడుల్స్‌లో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కైటో అనే వ్యాపారస్తుడు సుష్టుగా భోజనం చేద్దామని..
జపాన్ లోని ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి నూడుల్స్ ఆర్డర్ చేస్తే పాపం అతడికి నూడుల్స్‌లో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కైటో అనే వ్యాపారస్తుడు సుష్టుగా భోజనం చేద్దామని ఒక పెద్ద రెస్టారెంట్లోకి వెళ్లి నోరూరే స్పెషల్ థిక్ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఈ ఐటెంను ఒక కప్పులో వడ్డిస్తారట. కొద్దిసేపు తర్వాత రెస్టారెంట్ బేరర్ ఓ ప్లేటులో నూడుల్స్ కప్పును తీసుకొచ్చి కైటో ముందుంచాడు. అంతేకాదు ఆ బేరర్ కైటోకు తినే ముందు ఆ కప్పును బాగా షేక్ చేసి తింటే ఆ టేస్ట్ మరింత బాగుంటుందని మరీ మరీ చెప్పడంతో కైటో ముందుగా నూడుల్స్ కప్పును బాగా షేక్ చేశాడు. ఆ తర్వాత కప్పును ఓపెన్ చేసి మెల్లగా తినటం ప్రారంభించాడు. నూడుల్స్ మహారుచిగా ఉండడంతో ఆవురావురుమంటూ లాగించేశాడు. తినటం క్లైమామ్స్‌కు వచ్చాక కప్పులో నుంచి ఒక్క కప్ప తల పైకి పెట్టి మరీ కైటోను కోపంగా చూసింది. దాంతో కైటోకు కడుపంతా దేవేసినట్టైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పిల్లల కేర్ టేకర్.. కోటీశ్వరురాలు
ఆ కొలనులో నీరు ఎప్పటికీ ఎండిపోదు.. 5వేల ఏళ్ల మిస్టరీ
ట్రెండ్ అవుతున్న బెడ్ రాటింగ్.. అసలేంటది ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్‌లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

