IRTC Package: పుణ్యక్షేత్రాలు సందర్శించాలనుకుంటున్నారా? ఇదిగో సూపర్‌ ప్యాకేజీ.. వీడియో.

|

Aug 20, 2023 | 9:51 AM

తిరుమల శ్రీనివాసుని దర్శించుకోలానుకుంటున్నారా? అయితే ఇది మీకొక సువర్ణావకాశంగా చెప్పొచ్చు. అవును ఐఆర్‌టీసీ తిరుమల శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ రైలు విశాఖపట్నం నుంచి బయలుదేరి, అన్నవరం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోటమీదుగా ప్రయాణించి తిరుమలకు చేరుకుంటుంది. ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.

తిరుమల శ్రీనివాసుని దర్శించుకోలానుకుంటున్నారా? అయితే ఇది మీకొక సువర్ణావకాశంగా చెప్పొచ్చు. అవును ఐఆర్‌టీసీ తిరుమల శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ రైలు విశాఖపట్నం నుంచి బయలుదేరి, అన్నవరం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోటమీదుగా ప్రయాణించి తిరుమలకు చేరుకుంటుంది. ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇక తిరుమలతో పాటు కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, శ్రీకాహస్తి ఆలయాను కూడా సందర్శించుకోవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. అయితే ఆగస్టు 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22 తేదీల్లో ప్రయాణానికి టికెట్లు ఇప్పటికే విక్రయించేశారు.

సెప్టెబరు 29 తర్వాత నుంచి ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ రైలు విశాఖపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. శనివారం ఉదయం 4 గంటల 05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ఏసీ గదిలో బస.. ఏసీ రవాణా సదుపాయం, రెండు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం, తిరుమల, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల దర్శన టికెట్లూ ప్యాకేజీలోనే ఉంటాయి. ప్రభుత్వం నియమించిన ఏపీటీడీసీ గైడ్ యాత్రికులకు తోడుగా ఉంటారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు 250 రూపాయలు ఛార్జీగా వసూలు చేస్తారు. అయితే, ప్రయాణానికి నాలుగు రోజుల ముందు రద్దుచేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...