iran zombie: దెయ్యం రూపంతో ఫేమస్.. అసలు ముఖం ఇది.! ఆ కథ ఏంటంటే..!
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో.. ఓవరాల్‌గా భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ మధ్య ఫేమస్ అయ్యింది ఒక యువతి. అయితే ఎట్టకేలకు ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది.
ఇరాన్‌కు చెందిన సహర్ తబర్.. 2019లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లింది. ఎంజెలీనా జోలిలా మారాలనే ఆశతో సర్జరీలు చేయించుకుంటే.. అవి వికటించి వికృతంగా మారినట్లు తబర్‌పై ఓ ప్రచారం ఉండేది. ఆపై జరిగిన పరిణామాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్‌ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది. అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం.మహ్‌సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్‌లో ఉవ్వెత్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో నినదించారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం తగ్గి.. తబర్‌ను విడుదల చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
