Internet Explorer: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు సమాధి.. ఘనంగా నివాళులర్పించిన ఓ అభిమాని.. నెట్టింట వైరల్…
ఇంటర్నెట్ తొలితరం బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను ఇటీవలే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గూగుల్ రంగప్రవేశంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నెటిజన్లు పక్కకు పడేయడంతో
ఇంటర్నెట్ తొలితరం బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను ఇటీవలే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గూగుల్ రంగప్రవేశంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నెటిజన్లు పక్కకు పడేయడంతో అది మరుగునపడిపోయింది. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ 1995లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు 27 సంవత్సరాలపాటు సేవలు అందించింది. కాగా, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ దక్షిణ కొరియా వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు. ఏకంగా దానికి సమాధి కట్టి, నివాళి అర్పించాడు.ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. దక్షిణ కొరియన్లు 2014 వరకు ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంకింగ్ కోసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌పైనే ఆధారపడ్డారు. దీంతో ఒక అభిమాని దక్షిణ కొరియాలోని గ్యుయోంగ్జు నగరంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ‘ఇతర బ్రౌజర్లను డౌన్‌లోడ్ చేసేందుకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మంచి సాధనం’ అని ఆ సమాధిపై రాశాడు. ఈ సమాధి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

