Wedding Insident: విచిత్ర గెటప్ లో కల్యాణ మండపానికి వచ్చిన వరుడు.. నోరెళ్లబెట్టిన అతిథులు.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్ల హడావుడితో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధువుల హడావుడి.. స్నేహితుల అల్లర్లతో అట్టహాసంగా జరుగుతుంటాయి వివాహాలు. ప్రస్తుతకాలంలో
దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్ల హడావుడితో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధువుల హడావుడి.. స్నేహితుల అల్లర్లతో అట్టహాసంగా జరుగుతుంటాయి వివాహాలు. ప్రస్తుతకాలంలో పెళ్లిళ్లు కలకాలం గుర్తుండిపోవాలని రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వధూవరుల అల్లరి, ప్రత్యేక విన్యాసాలతో సందడి చేస్తున్నారు. తాజాగా గోద్రాకు చెందిన ఓ శివ భక్తుడు ఎవరూ ఊహించని విధంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.కాచివాడ్ ప్రాంతానికి చెందిన రిషబ్ పటేల్ అనే యువకుడు శివుడి వేషధారణలో పెళ్లి చేసుకున్నాడు. రిషబ్ పటేల్ శివ భక్తుడు కావడంతో ఆ శివయ్య వేషంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడి వేషధారణతో రిషబ్ పటేల్ వధువు మెడలో మూడుముళ్లు వేశాడు. పెళ్లి అనంతరం నగరంలోని ప్రధాన రహదారిపై డీజే, ధోల్ నగారా బీట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిన గోద్రాలోని అంకలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. అఘోరీ సాధు, సాధువులు కూడా రిషబ్ పటేల్ వివాహ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం రిషబ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

