పెళ్లిలో ఫుడ్ వేస్ట్ చేసిన అతిథులకు ఐఏఎస్‌ క్లాస్‌.. వీడియో

Updated on: Mar 03, 2022 | 9:57 AM

సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో విందు భోజనం భారీగానే ఉంటుంది. రకరకాల కూరలు, స్వీట్స్‌, ఇంకా ఇతర పదార్ధాలతో ప్లేట్‌ నిండిపోతుంది. అయితే అందరూ ఇంత భోజనాన్ని తినలేరు.

సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో విందు భోజనం భారీగానే ఉంటుంది. రకరకాల కూరలు, స్వీట్స్‌, ఇంకా ఇతర పదార్ధాలతో ప్లేట్‌ నిండిపోతుంది. అయితే అందరూ ఇంత భోజనాన్ని తినలేరు. దాంతో సగానికి సగం ఫుడ్‌ డస్ట్‌బిన్‌లోకే వెళ్తుంది. ప్ర‌తి ఫంక్ష‌న్‌లో ఇది కామన్‌గా జ‌రిగేదే. ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పినా ఎవ్వ‌రూ విన‌రు. ప్లేట్ నిండా పెట్టుకుంటారు.. అందులో సగం కూడా తిన‌రు. దాంతో వండిన దాంట్లో స‌గం ఫుడ్‌ ఇలా వేస్టేజ్ కింద పోతుంది. అయితే ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ దీనిపై స్పందించారు. ఐఏఎస్ ఆఫీస‌ర్ అవనీష్ శ‌ర‌ణ్ ఓ పెళ్లిలో వేస్ట్ అయిన ఫుడ్ ఫోటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. మీ పెళ్లిలో ఫోటోగ్ర‌ఫ‌ర్ మిస్ చేసే ఫోటో ఇదే. ఆహారాన్ని వృథా చేయ‌డం ఆపండి.. అంటూ ఆయ‌న క్యాప్ష‌న్ పెట్టారు. ఆ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఆహారం వృథా గురించి స‌రైన అవ‌గాహ‌న లేదు. ప్ర‌తి రోజు 20 కోట్ల మంది భార‌తీయులు ఆహారం దొర‌క్క ఖాళీ క‌డుపుతో ఉంటున్నారు. అందుకే ఆహారాన్ని ఇక‌నైనా వృథా చేయ‌కండి.. అంటూ ఐఏఎస్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

Also Watch:

మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో

ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్‌.. వీడియో

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో

Viral Video: మహిళపై షార్క్‌ ఎటాక్‌ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో

టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో