Houthi Rebels: ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపకుంటే మీ పనిపడతాం.. అమెరికా సీరియస్ వార్నింగ్.!

|

Jan 08, 2024 | 12:47 PM

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడిచేసి దోచుకుంటున్న హౌతీ రెబల్స్‌కు అమెరికాతోపాటు 12 మిత్ర దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. దాడులు తక్షణం ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా 2023 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ 23 నౌకలపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది.

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడిచేసి దోచుకుంటున్న హౌతీ రెబల్స్‌కు అమెరికాతోపాటు 12 మిత్ర దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. దాడులు తక్షణం ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా 2023 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ 23 నౌకలపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, తమ నుంచి కానీ, తమ మిత్ర పక్షాల నుంచి కానీ మరో హెచ్చరిక వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని నొక్కి చెప్పింది. ఈ మేరకు అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఈ అక్రమ దాడులకు వెంటనే ముగింపు పలకాలని, ఇప్పటికే అక్రమంగా నిర్బంధించిన నౌకలు, సిబ్బందిని విడిచిపెట్టాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి. కీలకమైన జలమార్గంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని బెదిరించడం కొనసాగితే అందుకు పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.