AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal: తాజ్‌మహల్‌ ను షాజహాన్‌ కట్టించలేదా.? ఇదిగో క్లారిటీ అంటూ కోర్ట్ లో పిటిషన్

Taj Mahal: తాజ్‌మహల్‌ ను షాజహాన్‌ కట్టించలేదా.? ఇదిగో క్లారిటీ అంటూ కోర్ట్ లో పిటిషన్

Anil kumar poka
|

Updated on: Nov 05, 2023 | 9:06 AM

Share

అశోకుడు చెట్లు నాటించెను.. షాజహాన్‌ తాజ్‌మహల్‌ను నిర్మించెను.. కులీకుతుబ్‌షా చార్మినార్‌ కట్టించెను... ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు. అయినా పాఠాలేంటి? వాస్తవాలు కూడాను. అయితే ఇప్పడు కొత్తవివాదం తలెత్తింది. తాజ్‌మహల్‌ను షాజహాన్‌ కట్టించలేదని హిందూసేన కోర్టులో పిటిషన్‌ వేసింది. చరిత్రను సరిదిద్దాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

అశోకుడు చెట్లు నాటించెను.. షాజహాన్‌ తాజ్‌మహల్‌ను నిర్మించెను.. కులీకుతుబ్‌షా చార్మినార్‌ కట్టించెను… ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు. అయినా పాఠాలేంటి? వాస్తవాలు కూడాను. అయితే ఇప్పడు కొత్తవివాదం తలెత్తింది. తాజ్‌మహల్‌ను షాజహాన్‌ కట్టించలేదని హిందూసేన కోర్టులో పిటిషన్‌ వేసింది. చరిత్రను సరిదిద్దాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని కోరింది. ఆగ్రాలోని తాజ్‌మహల్ నిర్మాణం 1631-1648 మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజ్‌మహల్‌కు సంబంధించి చరిత్ర పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ప్రస్తుతమున్న తాజ్‌మహల్ ఒకప్పుడు రాజామాన్ సింగ్ ప్యాలెస్ అని, దానికి షాజహాన్ తన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారని పేర్కొంది. ఈ మేరకు చరిత్ర పుస్తకాల్లో తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుషార్ గెడెలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హిందూ సేన ఇదే తరహా పిటిషన్‌తో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించింది. కానీ, ఈ విషయంలో ఏఎస్ఐ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు.. వెంటనే దీనిపై దృష్టిసారించాలని తాజాగా ఏఎస్ఐని కోరింది. కాగా, తాజ్‌మహల్ వయసు ఎంతో కూడా నిర్ధారించేందుకు ఏఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని హిందూ సేన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. తాజ్‌మహల్ విషయంలో తాము లోతైన అధ్యయనం చేశామని, చరిత్ర పుస్తకాల్లో ఈ విషయమై ఉన్న తప్పులు సరిదిద్ది ప్రజలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అభిప్రాయపడింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌ను కూల్చి మొఘలులు తాజ్‌మహల్ కట్టారనడానికి ఆధారాలు లేవని కూడా పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.