Hill of Clouds: ఇక్కడ మేఘాలు ఎలా పుడతాయో ఎప్పుడైనా చూశారా..! మేఘాలు పుట్టేది ప్రత్యక్షంగా చూడొచ్చు..
కాశంలో అంతెత్తున మేఘాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి మొత్తం ఆకాశాన్ని కప్పేసి భారీ వర్షాలు కురిపించడమూ మనకు తెలిసిందే. కానీ ఓ చోట మాత్రం ఓ పెద్ద కొండ
కాశంలో అంతెత్తున మేఘాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి మొత్తం ఆకాశాన్ని కప్పేసి భారీ వర్షాలు కురిపించడమూ మనకు తెలిసిందే. కానీ ఓ చోట మాత్రం ఓ పెద్ద కొండ మేఘాలకు పుట్టినిల్లుగా మారింది. ఏదో పాత్ర నుంచి నీటి ఆవిరి వస్తున్నట్టుగా.. ఆ పెద్ద కొండ నుంచి మేఘాలు పుడుతూనే ఉంటాయి. యునైటెడ్ కింగ్ డమ్‌లో జీబ్రాల్టర్ అనే ద్వీపకల్పం ఉంది. అందులో సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్నదే ఈ ఎత్తయిన జీబ్రాల్టర్ కొండ. మొత్తం ఒకే రాయితో ఏర్పడిన ఈ కొండ ఒక వైపున ఏకంగా 426 మీటర్ల ఎత్తున శిఖరం ఉంటుంది. అది సముద్రానికి అభిముఖంగా ఉండి.. అటు నుంచి వచ్చే గాలికి అడ్డుగా ఉంటుంది. ఈ క్రమంలో సముద్రం వైపు నుంచి వచ్చే గాలి ఈ కొండను తాకుతుండగా.. మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడైనా గాలి వీచే దిశలో పెద్ద పెద్ద పర్వతాలుగానీ, ఎత్తయిన కొండలుగానీ ఉన్నప్పుడు.. వీస్తున్న గాలి వాటికి తాకి పైకి లేస్తుంది. అలా పైకి వెళ్లినచోట తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి చిక్కబడుతుంది. మంచు స్పటికాలుగా మారడం మొదలై మేఘాలు ఏర్పడతాయి. ఇలా పర్వతాలు, కొండల కారణంగా ఏర్పడే మేఘాలను ‘బ్యానర్ క్లౌడ్’గా పిలుస్తారట. జీబ్రాల్టర్ కొండ వద్ద ఏర్పడే మేఘాలు కూడా ఇదే తరహావి అని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. ఏటా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ చిత్రాన్ని గమనించవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో ..ఈ కొండ, ఈ ప్రాంతం అద్భుతమంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

