Viral video: ఇంత దారుణమా హోమ్ వర్క్ చెయ్యలేదు అని స్కేల్‌తో తలపై కొట్టిన టీచర్.. చిన్నారి ప్రాణం దక్కేనా..?
హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ చిన్నారిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడి మరణించింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని
హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ చిన్నారిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడి మరణించింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. అర్సపల్లికి చెందిన ఫాతిమాకు ఏడేళ్లు. ఫాతిమా ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఉన్న ఓ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోంవర్క్ చేయలేదని టీచర్ హింసించారు. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిలబెట్టారు. స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడలో వేసి మోయించారు. అంతటితో ఆగకుండా.. చిన్నారి తలపై స్కేల్‌తో బలంగా కొట్టారు.దీంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే.. తల్లిదండ్రులు ఫాతిమాను ఆస్పత్రికి తరలించగా, తలలో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో.. ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఫాతిమా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫాతిమాను కొట్టిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. చిన్నారి ఫాతిమా మృతి చెందిన వార్త తెలుసుకున్న డీఈఓ.. పాఠశాలను మూసివేయించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

