ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్

ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్

Phani CH

|

Updated on: Apr 22, 2024 | 12:17 PM

అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మొదటిసారిగా ఆవు పాలలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్, కాన్సాస్, మిషిగాన్, న్యూ మెక్సికో, ఇడాహో, ఒహాయో, నార్త్ కరోలినా రాష్ట్రాల్లోని 13 పశువుల మందల్లో బర్డ్ ఫ్లూ ప్రబలినట్టు గుర్తించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ తీవ్రత అధికం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మొదటిసారిగా ఆవు పాలలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్, కాన్సాస్, మిషిగాన్, న్యూ మెక్సికో, ఇడాహో, ఒహాయో, నార్త్ కరోలినా రాష్ట్రాల్లోని 13 పశువుల మందల్లో బర్డ్ ఫ్లూ ప్రబలినట్టు గుర్తించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ తీవ్రత అధికం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. పచ్చి పాలలోనే ఈ వైరస్ ఉన్నట్టు గుర్తించగా, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నిర్మూలనకు గురవుతుందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. బర్డ్ ఫ్లూ కారక హెచ్5ఎన్1 వైరస్ ను 1996లో తొలిసారిగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి బర్డ్ ఫ్లూ తీవ్రత అధికమైంది. లక్షలాది పక్షులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. అయితే మనుషులు, పిల్లులు, ఎలుగుబంట్లు, నక్కలు, పెంగ్విన్లు, మింక్స్ వంటి జీవుల్లోనూ వైరస్ ఇన్ఫెక్షన్లు కలవరపరుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెద్దలను ఒప్పించి ఘనంగా.. శ్రీకృష్ణుడి విగ్రహంతో పెళ్లి

Health Insurance: ఇక ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా తీసుకోవచ్చు