పెద్దలను ఒప్పించి ఘనంగా.. శ్రీకృష్ణుడి విగ్రహంతో పెళ్లి
చిన్నప్పటి నుంచి ఆరాధించిన శ్రీకృష్ణుడిని ఓ యువతి వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిందీ ఘటన. 23 ఏళ్ల శివానీ పరిహార్‌కు శ్రీకృష్ణుడంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భక్తి. తనతోపాటే అది పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయననే పెళ్లి చేసుకోవాలని భావించింది. విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది. బుధవారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంది.
చిన్నప్పటి నుంచి ఆరాధించిన శ్రీకృష్ణుడిని ఓ యువతి వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిందీ ఘటన. 23 ఏళ్ల శివానీ పరిహార్‌కు శ్రీకృష్ణుడంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భక్తి. తనతోపాటే అది పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయననే పెళ్లి చేసుకోవాలని భావించింది. విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది. బుధవారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంది. వేదమంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి అనంతరం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహించారు. అంతకుముందు వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వచ్చింది. అనంతరం స్థానిక ఆలయంలో పెళ్లి ఘనంగా జరిగింది. వివాహానంతరం శివానీ వివాహ ప్రమాణ పత్రం కూడా అందుకుంది. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో కలిసి బృందావనం బయలుదేరింది. అక్కడి రాధా ధ్యాన్ ఆశ్రమంలో శ్రీకృష్ణుడి సేవలో తన తదుపరి జీవితాన్ని గడపనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

