టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌

|

May 10, 2024 | 1:34 PM

ఎంత బాగా చదివినా నూటికి 90 మార్కులు రావడం గగనం. మరీ పరీక్ష ఇరగదీస్తే నూటికి నూటికి నూరు మార్కులు వస్తాయి. కానీ ఈ విద్యార్ధిని మాత్రం బాగా చదివి పరీక్షలు రాసినట్టుంది. టీచర్‌ చేతికి ఎముక లేకుండా మార్కులు వేసింది. రెండు సబ్జెక్టులకు 200 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తే ఏకంగా 212, 211 మార్కులు వేసేసింది. దీంతో సదరు విద్యార్ధిని మార్కుల షీట్‌ చూసి ఆ విద్యార్ధితోపాటు తల్లిదండ్రులు కూడా షాకయ్యారు.

ఎంత బాగా చదివినా నూటికి 90 మార్కులు రావడం గగనం. మరీ పరీక్ష ఇరగదీస్తే నూటికి నూటికి నూరు మార్కులు వస్తాయి. కానీ ఈ విద్యార్ధిని మాత్రం బాగా చదివి పరీక్షలు రాసినట్టుంది. టీచర్‌ చేతికి ఎముక లేకుండా మార్కులు వేసింది. రెండు సబ్జెక్టులకు 200 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తే ఏకంగా 212, 211 మార్కులు వేసేసింది. దీంతో సదరు విద్యార్ధిని మార్కుల షీట్‌ చూసి ఆ విద్యార్ధితోపాటు తల్లిదండ్రులు కూడా షాకయ్యారు. ఖంగుతిన్న విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచిత్ర ఘటన గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో వెలుగు చూసింది. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా ఝలోద్ తాలూకా ఖరసనా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థిని వంశీబెన్ మనీష్‌భాయ్‌ ఇటీవల పరీక్షలు రాసింది. బాలిక పరీక్షల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు సబ్జెక్టులలో 200 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. గుజరాతీ ల్యాంగ్వేజ్‌ పరీక్షలో 200కుగాను 211, గణితం సబ్జెక్టులో 200కుగాను 212 మార్కులు స్కోర్‌ చేసినట్లు మార్కుల షీట్‌ వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే

Maldives: మీరొస్తేనే మేం బతకగలం.. దిగొచ్చిన మాల్దీవులు !!

దడ పుట్టిస్తోన్న కొవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా ఉపయోగం లేదా

నిమిషాల్లో వజ్రాలు తయారీ.. ఎక్కడంటే ??