Bride – groom: వేదికపై రొమాంటిక్ సాంగ్‌తో రెచ్చిపోయిన వరుడు.. కాబోయే భార్యముందు కూర్చొని.. వీడియో.
ఇటీవల పెళ్లి వేడుకల్లో వధూవరులు రకరకాల విన్యాసాలు చేయడం పరిపాటిగా మారింది. సాధారణంగా పెళ్లంటేనే ఎంతో సందడి, సరదాగా సాగే కార్యక్రమం. చుట్టాలు, బంధుమిత్రులలో ఎంతో కోలాహలంగా మారుతుంది పెళ్లి వేదిక. అయితే
ఈ వీడియోలో పాకిస్థాన్‌కు చెందిన ఓ కొత్త జంట వేదికపై పెళ్లిదుస్తుల్లో అందంగా అలంకరించుకొని కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో వరుడు.. వధువు ముందు కూర్చుని అతిథులందరూ చూస్తుండగానే ఓ రొమాంటిక్ సాంగ్ అందుకున్నాడు. పెండ్లికొడుకు సమి రషీద్ తన కాబోయే భార్య ఎదుట గిటార్ ప్లే చేస్తూ అమీర్‌ఖాన్, కాజోల్ నటించిన ఫనా మూవీలోని చాంద్ షిఫారస్.. పాటను ఎంతో హృద్యంగా పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. వరుడి పెర్‌ఫార్మెన్స్‌కి వధువు సిగ్గుతో మురిసిపోయింది. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూడాల్సిందే. ఈ సమయంలో అతిథులంతా తమ హర్షధ్వానాలతో వరుడిని అభినందించారు. అద్భుతమైన ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ శుభాకాంక్షల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

