కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
తిరుపతిలో క్షుద్రపూజల భయంతో ఓ తండ్రి తన మరణించిన కొడుకు సమాధికి సోలార్ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. అస్తికలు దొంగిలించబడవచ్చనే ఆందోళనతో రోజూ మొబైల్ ద్వారా పర్యవేక్షిస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కాగా, పోలీసులు క్షుద్రపూజల కార్యకలాపాలు లేవని కుటుంబానికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. అయినా, ఆ తండ్రి తన బిడ్డ సమాధి భద్రత కోసం నిఘా కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుత కాలంలో ఆప్తుల సమాధులను కూడా కావలి కాయాల్సిన పరిస్థితులు దాపురించాయా అంటే అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. ఇటీవల కాలంలో క్షుద్రపూజల కోసం అస్తికలు దొంగిలిస్తున్న ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరణించిన తన కుమారుడి సమాధికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీకి చెందిన బాలుడు ఈ నెల 8వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని ఊరి పొలిమేరల్లోని శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి, సమాధి భద్రతపై ఆందోళన చెందాడు. క్షుద్ర పూజలు చేసేవాళ్లు తన బిడ్డ మృతదేహాన్ని తవ్వేస్తారనే అనుమానంతో సమాధి వద్ద సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. దాని ఫుటేజీని రోజూ తన మొబైల్ ఫోన్‌లో చూస్తూ పర్యవేక్షిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. చంద్రగిరి మండలంలో క్షుద్ర పూజల వంటి కార్యకలాపాలు జరగవని, ఈ విషయంలో ఆ కుటుంబానికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. అయినప్పటికీ ఎంతో ప్రేమగా పెంచుకున్న కన్నబిడ్డ మృత్యుఒడికి చేరడంతో.. ఆ తండ్రి తన కొడుకు మృతదేహం ఎలాంటి ఆగంతకులకు దొరకకూడదని సమాధికి రక్షణగా సీసీ కెమెరా నిఘాను కొనసాగిస్తూనే ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అమెరికా వెళ్లటం ఇక కష్టమే బాస్.. టూరిస్ట్ వీసాపైనా సవాలక్ష ఆంక్షలు
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
తల్లీ కూతుళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు