Gold: తీరానికి కొట్టుకొస్తున్న బంగారం.. ఉప్పాడ బీచ్‌కు పోటెత్తిన జనం.

వర్షాలు ప్రారంభం కాగానే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురుకి వజ్రాలు దొరికినట్లు.. వాటిని భారీ రేటుకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పుడూ జరిగేదే.. తాజాగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారం స్థానికంగా జోరందుకోవడంతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమీప ప్రాంతాల..

Gold: తీరానికి కొట్టుకొస్తున్న బంగారం.. ఉప్పాడ బీచ్‌కు పోటెత్తిన జనం.

|

Updated on: Jun 05, 2024 | 6:50 PM

వర్షాలు ప్రారంభం కాగానే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురుకి వజ్రాలు దొరికినట్లు.. వాటిని భారీ రేటుకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పుడూ జరిగేదే.. తాజాగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారం స్థానికంగా జోరందుకోవడంతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి వచ్చి.. బంగారం కోసం అన్వేషిస్తున్నారు. భారీ వర్షాలు, సైక్లోన్లు, పోటు సమయంలో సముద్రం అల్లకల్లోంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఆ సమయంలో అలలు గట్టిగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ సమయంలో అలలతో పాటు ఇసుక, పలు రకాల సముద్ర జీవులు, ద్రవ, ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

పూర్వం కోటలు, పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతుంటాయని వారి అభిప్రాయం. గతంలో తుఫాను వచ్చినప్పుడు కోనపాపపేట తీరం ఒడ్డున ఇసుకలో పురాతన సిల్వర్ కాయిన్స్ దొరికాయి. ఉప్పాడ తీరంలోని మంగళ దిబ్బ ప్రాంతంలో పలుమార్లు బంగారం లభ్యం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను కారణంగా ఉప్పాడ తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మత్స్యకారులు, స్థానికులు గత రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం ఒడ్డున బంగారం కోసం వెతుకుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
కాలినడకన తిరుమలకు త్రివిక్రమ్.. గురూజీ తనయుడిని చూశారా? వీడియో
కాలినడకన తిరుమలకు త్రివిక్రమ్.. గురూజీ తనయుడిని చూశారా? వీడియో
తొలి ప్రయత్నంలోనే 'నీట్‌' క్లియర్‌ చేసిన తండ్రికూతుళ్లు
తొలి ప్రయత్నంలోనే 'నీట్‌' క్లియర్‌ చేసిన తండ్రికూతుళ్లు
మీ నాలుక రంగు మారిందా.? ఈ సమస్యలు ఉన్నట్లే..
మీ నాలుక రంగు మారిందా.? ఈ సమస్యలు ఉన్నట్లే..
అర్జున్ కూతురి రిసెప్షన్‏లో మెరిసిన ఏంజెల్.. ఎవరంటే..
అర్జున్ కూతురి రిసెప్షన్‏లో మెరిసిన ఏంజెల్.. ఎవరంటే..
టీమిండియా కోచ్ రేసులో డేంజరస్ ప్లేయర్.. 5 ఏళ్ల క్రితమే దరఖాస్తు
టీమిండియా కోచ్ రేసులో డేంజరస్ ప్లేయర్.. 5 ఏళ్ల క్రితమే దరఖాస్తు
4 ఓవర్లు.. 4 మెయిడిన్లు.. 3 వికెట్లు.. బంతులు కావవి బుల్లెట్లు
4 ఓవర్లు.. 4 మెయిడిన్లు.. 3 వికెట్లు.. బంతులు కావవి బుల్లెట్లు
అబ్బో.. అమ్మడు బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
అబ్బో.. అమ్మడు బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
ఆ దేశంలో దారుణ పరిస్థితులు.. టమాట కిలో రూ.200, చికెన్‌ రూ.700!
ఆ దేశంలో దారుణ పరిస్థితులు.. టమాట కిలో రూ.200, చికెన్‌ రూ.700!
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని